యంగ్ హీరో ని అవమానించిన అమలా పాల్


యంగ్ హీరో ని అవమానించిన అమలా పాల్
అమలా పాల్

బ్లాక్ బ్యూటీ అమలా పాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని ఘోరంగా అవమానించింది . ఇంతకీ ఈ భామ ఈ హీరోని ఎందుకు అవమానించిందో తెలుసా ….. తమిళంలో విజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని తెలుగులో ” రాక్షసుడు ” గా రీమేక్ చేస్తున్నారు . రైడ్ , వీరా వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రమేష్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు కాగా తమిళంలో అమలా పాల్ – విష్ణు విశాల్ జంటగా నటించారు .

అమలా పాల్ పాత్రలో తెలుగులో అనుపమా పరమేశ్వరన్ నటిస్తోంది ఇక విష్ణు విశాల్ పాత్రలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు . అయితే విష్ణు విశాల్ లా నటించడం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వల్ల కాదని ఒక్క ముక్కలో తేల్చిపడేసింది అమలా పాల్ . తమిళంలో రాక్షసన్ సంచలన విజయం సాధించింది అలాగే విష్ణు విశాల్ నటనకు జేజేలు పలికారు . విష్ణు విశాల్ స్థాయి నటన బెల్లంకొండ వల్ల కాదని అనడం అంటే ఘోరంగా అవమానించడమే !