యాంగ్రీ మ్యాన్ సరసన బోల్డ్ హీరోయిన్


amala paul to play female lead in rajasekhar movie
amala paul to play female lead in rajasekhar movie

గరుడవేగతో వచ్చిన ఊపుని కల్కి సినిమాతో పోగొట్టుకున్నాడు రాజశేఖర్. ఆ సినిమా నష్టాలను మిగల్చడమే కాకుండా రాజశేఖర్ లుక్స్ పై కూడా కామెంట్స్ వచ్చేలా చేసింది. ఏదేమైనా కల్కి తర్వాత రాజశేఖర్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు.

ఈ సినిమాని కొత్త దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కించనున్నాడు. అక్టోబర్ లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్ గా అమలా పాల్ ను సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మధ్య అమలా పాల్ పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమైపోయింది.

రీసెంట్ గా ఆమె నటించిన డబ్బింగ్ చిత్రం ఆమెతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం గ్లామర్ కు పరిమితమయ్యే పాత్రలకు స్వస్తి పలికి యాక్టింగ్ కు స్కోప్ ఉండే పాత్రలనే ఎంచుకుంటున్న అమలా పాల్ మరి ఏం చూసి ఈ చిత్రాన్ని ఎంచుకుందో తెలియాలంటే కొద్ది రోజులు ఎదురుచూడాలి.