ఎక్స్‌క్లూజివ్‌: అమ‌లాపాల్ భ‌లే షాకిచ్చేసిందే!


Amala paul wedding with boy friend Bhavinder singh
Amala paul wedding with boy friend Bhavinder singh

హీరోయిన్ అమ‌లాపాల్ అద‌రిపోయే షాకిచ్చింది. ద‌ర్శ‌కుడు ఏ.ఎల్‌. విజ‌య్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ‌లాపాల్ ఏడాది తిర‌క్కుండానే ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తడం, సినిమాల్లో న‌టిస్తాన‌ని చెప్ప‌డంతో విడాకులు తీసుకుంది. అప్ప‌టి నుంచి ఒంట‌రిగానే వుంటూ చిత్ర విచిత్ర‌మైన చిత్రాల్లో న‌టిస్తూ వార్త‌ల్లో నిలిచింది. ధ‌నుష్ కార‌ణంగానే అమ‌ల త‌న త‌న‌యుడితో విడిపోయింద‌ని, ఏ.ఎల్ విజ‌య్ తండ్రి ఆ మ‌ధ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై అమ‌లా పాల్ కూడా ఘాటుగానే స్పందించింది. త‌ను, ఏ.ఎల్. విజ‌య్‌తో విడిపోవ‌డానికి ధ‌నుష్ కార‌ణం కాద‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయితే ఆ త‌రువాత బాలీవుడ్‌కు చెందిన భ‌వీంద‌ర్ సింగ్‌తో గ‌త కొంత కాలంగా లీవ్ ఇన్ రిలేష‌న్ షిప్‌లో వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ వార్త‌ల‌పై అమ‌ల స్పందించ‌లేదు.

తాజాగా భ‌వీంద‌ర్‌సింగ్‌ని పంజాబీ స్టైల్లో అమ‌లాపాల్ వివాహం చేసుకున్న ఫొటోలు తాజాగా సోష‌ల్ మీడియ‌లో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం ప‌లువురిని షాక్‌కు గురిచేస్తోంది.గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఏ స్థాయికి చేరిందో ఫొటోల్లో తిప్ టు లిప్ కిస్ పెడుతున్న తీరే అద్ధంప‌డుతోంద‌ని చెబుతున్నారు. అయితే వీరి వివాహం మాత్రం ఇటీవ‌ల జ‌రిగింది కాద‌ని, కొన్ని రోజుల క్రిత‌మే జ‌రిగింద‌ని, ఆ ఫొటోల‌నే ప్రియుడు భ‌వీంద‌ర్‌సింగ్ తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడ‌ని తెలుస్తోంది.