అమ‌లాపాల్‌కు పితృవియోగం!Amala Pauls father pasess away
Amala Pauls father pasess away

న‌టి అమ‌లాపాల్ తండ్రి పాల్‌ వ‌ర్గీస్ (61) బుశారం కేర‌ళ‌లోని కొచ్చీలో మృతి చెందారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న బుధ‌వారం తుది శ్వాస విడిచారు. గ‌త కొంత కాలంగా పాల్ వ‌ర్గీస్ ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. కొచ్చీలో చిక్ఇత్స పొందుతున్న ఆయ‌న చివ‌రికి తుది శ్వాస విడిచార‌ని అమ‌లా పాల్ కుటుంబం స‌భ్యులు మీడియాకు వెల్ల‌డించారు.

పాల్ వ‌ర్గీస్ చ‌నిపోయిన స‌మ‌యంలో అమ‌లాపాల్ త‌న కొత్త సినిమా ప్ర‌మోష‌న్ కోసం చెన్నైలో వున్నార‌ట‌. అమ‌లాపాల్ న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `అదో అంద పార‌వై పోల‌`. మ‌హిళా ప్ర‌ధాన ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ సినిమా ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం చెన్నైలో ఏర్పాటు చేశారు. ఇందు కోసం చెన్నై వ‌చ్చిన అమ‌లాపాల్ తండ్రి మ‌ర‌ణ వార్త విని వెంట‌నే కొచ్చీకి బ‌య‌లుదేరింద‌ట‌.

సేయింట్ పీట‌ర్, పాల్ క్యాథ‌లిక్ చ‌ర్చిలో పాల్ వ‌ర్గీస్ అంత్య‌క్రియ‌ల్ని బుధ‌వారం 5 గంట‌ల‌కు నిర్వ‌హించిన‌ట్టు కుటుంబ స‌భ్యులు తెలిపారు.