అమర్ అక్బర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్


Amar Akbar Anthony concept poster72 వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రవితేజ నటిస్తున్న ” అమర్ అక్బర్ ఆంటోనీ ” కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం . శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమెరికాలో జరుపుకుంటోంది . కాగా దసరా కానుకగా అక్టోబర్ 5 నా అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . త్వరలోనే ఫస్ట్ లుక్ ని వదులుతామని ఆ పోస్టర్ లో పేర్కొన్నారు చిత్ర బృందం .

రవితేజ సరసన ఇలియానా నటిస్తోంది . రవితేజ – ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన కిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది అయితే దాని తర్వాత చేసిన ఖతర్నాక్ , దేవుడు చేసిన మనుషులు ప్లాప్ అయ్యాయి . ఇక శ్రీను వైట్ల – రవితేజ ల కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు ”నీ కోసం”, ”దుబాయ్ శీను ” , ” వెంకీ ” సూపర్ హిట్ అయ్యాయి వాటి తర్వాత మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడే ఈ చిత్రం రూపొందుతోంది . రవితేజ తో పాటు శ్రీను వైట్ల కూడా ప్లాప్ లలో ఉన్నాడు దాంతో ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు . ఇక శ్రీను వైట్ల పరిస్థితి అయితే జీవన్మరణ సమస్య గా మారింది . ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలి లేదంటే కెరీర్ అయిపోయినట్లే ! అలా ఉంది అతడి పరిస్థితి .

English Title: Amar Akbar Anthony concept poster