మ‌హేష్ థియేట‌ర్లో బొమ్మ ప‌డుతోంది!మ‌హేష్ థియేట‌ర్లో బొమ్మ ప‌డుతోంది!
మ‌హేష్ థియేట‌ర్లో బొమ్మ ప‌డుతోంది!

క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. దీంతో అన్ని రంగాల‌తో పాటు సినీ రంగం కూడా లాక్‌డౌన్ ప్ర‌క‌టించింది. థియేట‌ర్ల‌న్నీ మూత‌ప‌డ్డాయి. గ‌త ఎనిమిది నెల‌లుగా లాక్‌డౌన్ అమ‌ల్లో వుండ‌టంతో థియేట‌ర్ల రీఓపెన్ అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. క్ర‌మ క్ర‌మంగా లాక్‌డౌన్‌ని కేంద్రం స‌డ‌లిస్తూ వివిధ రంగాల‌కి వెసులు బాటును క‌ల్పిస్తూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో థియేట‌ర్స్ రీఓపెన్ పై శ‌ర‌తుల‌తో కూడిన ప్ర‌క‌ట‌న చేసింది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు కూడా థియేట‌ర్ల‌ని రీఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్ర‌మే థియేట‌ర్ల‌ని రీఓపెన్ చేసుకోవ‌చ్చ‌ని ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్త‌ర్వుల్ని పాటిస్తూ థియేట‌ర్లు తెర‌వ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. తాజాగా స్టార్ హీరో మ‌హేష్ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఏ ఎంబీ సినిమాస్‌ని డిసెంబ‌ర్ 4 న రీఓపెన్ చేస్తున్న‌ట్టు మంగ‌ళ‌వారం థియేట‌ర్ యాజ‌మాన్యం మీడియా ద్వారా ప్ర‌క‌టించింది.

దీంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. `ఇట్స్ టైమ్ ఫ‌ర్ యాక్ష‌న్‌.. వీ ఆర్ ఆల్ సెట్ టు ఓపెన్ డిసెంబ‌ర్ 4` అంటూ ప్ర‌క‌టించారు. మంగ‌ళ‌వారం నుంచే బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయిన‌ట్టు వెల్ల‌డించ‌డంతో ఇక సింగిల్ స్క్రీన్స్ కూడా తిరిగి పునః ప్రారంభం కావ‌డం గ్యారంటీ అని తెలుస్తోంది.

ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌గానే యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. ఏ ఎంబీ థియేట‌ర్స్ రీ ఓపెన్‌తో మ‌రింత మంది థియేట‌ర్స్ యాజ‌మాన్యం ముందుకు వ‌చ్చి థియేట‌ర్ల‌ని పునః ప్రారంభించి సాధార‌ణ స్థితికి స్వాగ‌తం ప‌ల‌కుతార‌ని ఇండ‌స్ట్రీ ఆశ‌గా ఎదురుచూస్తోంది.