అమీషా పటేల్ కి చిక్కులు


Ameesha Patel
Ameesha Patel

బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది . అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర 2. 5 కోట్లు తీసుకొని సినిమా చేస్తానని చెప్పి అతడికి సొమ్ము ఇవ్వకపోవడంతో పెద్ద గొడవే అయ్యింది . చివరకు అతడికి 3 కోట్ల చెక్ ఇచ్చింది కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో కోర్టుకెక్కాడు దాంతో అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది . సినిమా ఆగిపోవడంతో అమీషా పటేల్ కు కష్టాలు వచ్చి పడ్డాయి .

ఒకవేపు నటించడానికి సినిమాలు లేవు దాంతో ఆదాయం తగ్గిపోయింది , మరోవైపు తీసుకున్న అప్పు పెరిగిపోతోంది అలాగే పరువు తీసిపడేస్తోంది దాంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంది అమీషా పటేల్ . తెలుగులో బాలకృష్ణ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ తదితర స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది . అలాగే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ కానీ కాలం రివర్స్ అయ్యింది దాంతో చిక్కుల్లో పడింది పాపం .