సైరా లో ఎంటర్ అయిన అమితాబ్


amitabh bachchan enters in sye raa narasimha reddyదేశ స్వాతంత్య్రం కోసం అరివీర భయంకరంగా పోరాడిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాగా అతడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ” సైరా ….. నరసింహారెడ్డి ”. మెగాస్టార్ చిరంజీవి , నయనతార , జగపతి బాబు , విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ చిత్రంలో నరసింహారెడ్డి గురువుగా కీలక పాత్రలో లెజెండ్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం సైరా యూనిట్ లో ఎంటర్ అయ్యాడు అమితాబ్ .

అంతేకాదు సూపర్ స్టార్ చిరంజీవి అంటూ తెలుగులో ట్వీట్ చేసి మెగా అభిమానులను సంతోష పరచడమే కాకుండా చిరు కోరిక మేరకు సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నట్లు పేర్కొన్నాడు అమితాబ్ . సైరా కోసం హైదరాబాద్ వచ్చాడు అమితాబ్ . ప్రస్తుతం సైరా షూటింగ్ జరుపుకుంటోంది . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు .