ఫిబ్రవరిలో అమితాబ్ ఝాండ్ సినిమా రిలీజ్


Amitabh Bachchan new movie in February
Amitabh Bachchan new movie in February

అమితాబ్ బచ్చన్ ని అందరూ ఇండియన్ మెగాస్టార్ అని పిలుస్తారు. వయసుకు అతీతంగా ఇప్పటికీ కొత్త కొత్త పాత్రలతో, కొత్త కథలు చేస్తూ, కొత్త దర్శకులను ప్రోత్సహించటం ఆయన గొప్పతనానికి నిదర్శనం. తాజాగా ఆయన కొత్త చిత్రం లెజెండ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయింది ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తున్నారు. గతంలో మరాఠీలో “సైరట్” అనే సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగరాజ్ మంజులే ఈ సినిమాకు దర్శకుడు. ఒక చిన్న రీజినల్ లవ్ స్టోరీ సినిమా తీసి బాలీవుడ్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కలక్షన్లు, ప్రశంసలు దక్కించుకున్న నాగరాజ్ ఇక బచ్చన్ లాంటి నటుడితో ఎలాంటి మ్యాజిక్ చేశారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.

ముంబై మహానగరంలో అనాధలుగా ఉండి, మాదకద్రవ్యాలకు అలవాటు పడి హీనమైన జీవితం జీవిస్తున్నవీధి బాలలను, మామూలు మనుషులుగా మార్చి వారితో ఒక ఫుట్ బాల్ జట్టు తయారుచేసిన ఈ కోచ్ కథ ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయింది ఇప్పుడు అధికారులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో గురువు గోసాయి వెంకన్న పాత్రలో కనిపించిన అమితాబచ్చన్ ఈ సినిమాలో కూడా మరొక గురువు పాత్ర లో కనిపిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమా కథను నిజజీవితంలో ఇలాంటి అరుదైన ఘనత సాధించిన ఫుట్ బాల్ ఆటగాడు విజయ్ బార్సే జీవితం నుంచి ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. బాలీవుడ్ లో అటు బయోపిక్ లకి ఇటు స్పోర్ట్స్ నేపథ్యంలో ఉన్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది.

ఇక అలాంటి కమర్షియల్ సక్సెస్ ఉండే ఇలాంటి జానర్ లకి గట్టి హీరో పడితే ఇక ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇక అమితాబ్ బచ్చన్ గారి అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.