బిగ్ బి అమితాబ్ కు సినీ అత్యున్నత పురస్కారం


Amitabh to be conferred with dada saheb phalke
Amitabh to be conferred with dada saheb phalke

భారత సినీ రంగంలో అత్యున్నత సేవలు అందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి ప్రతీ ఏటా సత్కరిస్తుంది. ఈ ఏడాది ఈ అత్యుతమ పురస్కారాన్ని ఇండియన్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు ఇవ్వబోతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో ప్రకటించారు.

60 ఏళ్లుగా సినిమాలకు నిర్విరామంగా సేవలందించిన అమితాబ్ ఈ పురస్కారానికి అన్ని విధాలా అర్హుడని, ఇప్పటికే ఈ అత్యున్నత పురస్కారం రావడానికి లేట్ అయిందని ప్రముఖులు స్పందించారు. మరోవారంలో విడుదల కాబోతున్న సైరా చిత్రంలో చిరంజీవి గురువు పాత్రలో కనిపించబోతున్నారు అమితాబ్.

ఈ సమయంలో అవార్డు ప్రకటించడంతో సైరా బృందం తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. అమితాబ్ బచ్చన్ తన కెరీర్ లో ఎన్నో మరపురాని పాత్రలలో ప్రేక్షకులను అలరించారు. ఆయన షోలేలో వేసిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా బిగ్ బి కి శుభాకాంక్షలు .