పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అమీ జాక్సన్


Amy Jackson becomes mother of Baby Boy
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన యామీ జాక్సన్

ఎవడు, ఐ, 2.0 వంటి సినిమాలతో సౌత్ లో సుపరిచితం అయిన నటి అమీ జాక్సన్ గర్భవతి అన్న విషయం అందరికీ తెల్సిందే. తను ప్రేమించిన జార్జిను కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకున్న అమీ జాక్సన్ ఇప్పుడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.

గ్రీకు సంప్రదాయం ప్రకారం తాత పేరును బిడ్డకు పెట్టారు. తనను ఆండ్రియాస్ గా ప్రపంచానికి పరిచయం చేసింది అమీ. ఈ విషయాన్ని తెలుసుకున్న ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు, శ్రేయోభిలాషులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

View this post on Instagram

 

Our Angel, welcome to the world Andreas 💙

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Credit: Instagram