ఆనంద్ దేవ‌ర‌కొండ `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`!


ఆనంద్ దేవ‌ర‌కొండ `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`!
ఆనంద్ దేవ‌ర‌కొండ `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`!

విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ `దొర‌సాని` చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. తొలి చిత్రం ఫ‌ర‌వాలేద‌నిపించ‌డంతో త‌దుప‌రి చిత్రాన్ని మ‌రింత కొత్త‌గా చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్టున్నారు. వెరైటీ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై  వెనిగ‌ళ్ల ఆనంద‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. వినోద్ అనంతోజు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రంలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

అన్ని కార్య్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా వుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత వెనిగ‌ళ్ల ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ `షూటింగ్ మొత్తం పూర్త‌యింది. క‌థ‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ నిర్మించిన చిత్ర‌మిది. గుంటూరు నేప‌థ్యంలో క‌థ సాగుతుంది. గుంటూరు జిల్లా కొల‌క‌లూరు ప్రాంతంలోనూ, గుంటూరు సిటీలోనూ.. ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. పాత్ర‌ల‌న్నీ గుంటూరు యాస‌లోనే మాట్లాడ‌తాయి. ఈ వేస‌వికి చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా విడుద‌ల వాయిదా వేశాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీ వివ‌రాలను వెల్ల‌డిస్తాం` అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `మామూలు మ‌నుషుల జీవితాల్లో వుండే సున్నిత‌మైన హాస్యాన్ని ఇందులో చూపించాము. ప్ర‌తీ ఒక్క‌రు త‌మ‌ను తాము ఐడెంటిఫై చేసుకునేలా పాత్ర‌లు వుంటాయి. వాటితో పాటు మంచి ల‌వ్‌స్టోరీ కూడా వుంది. ఆనంద్ దేవ‌ర‌కొండ పాత్ర చాలా భిన్నంగా కొత్త‌గా వుంటుంది. `కేరాఫ్ కంచ‌ర‌పాలెం`తో పాటు ప‌లు చిత్రాల‌కు సంగీతం అందించిన అగ‌స్త్య ఈ చిత్రానికి అద్భుత‌మైన పాట‌లు అందించారు` అన్నారు.