ఆనంద్ దేవరకొండ రెండో సినిమా రెడీ

Anand Devarakonda
Anand Devarakonda

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన రెండో చిత్రాన్ని ఖరారు చేసాడు . కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ . ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది ఎవరో తెలుసా విజయ్ దేవరకొండ . అవును ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ దేవరకొండ తన కింగ్ ఆఫ్ ద హిల్ బ్యానర్ మీద నిర్మించడానికి సిద్దమయ్యాడు .

దొరసాని చిత్రంతో ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ హిట్ కాలేదు దాంతో తనని తానూ నిరూపించుకోవడానికి బాగానే కష్టపడుతున్నాడు ఆనంద్ దేవరకొండ . ఇక ఇదే సమయంలో బయటి బ్యానర్ కాకుండా సొంత బ్యానర్ అయితే మంచిదని భావించిన విజయ్ దేవరకొండ తానె ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాడట . మొదటి సినిమాతో దెబ్బతిన్న ఆనంద్ దేవరకొండ ఈ సినిమాతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి .