విజయ్ దేవరకొండ తమ్ముడు మరో సినిమాకు రెడీ


Anand devarakonda ready to next film
Anand devarakonda ready to next film

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు . దొరసాని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ దేవరకొండ రాజుగా మెప్పించాడు . తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది దాంతో రెండో సినిమా కు ప్లాన్ చేసుకుంటున్నాడు . దొరసాని రిజల్ట్ వచ్చాక దాన్ని బట్టి తన తదుపరి సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడు .

దొరసాని విడుదలై మంచి పేరు తేవడంతో ఈసారి కమర్షియల్ చిత్రం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు . ఇక ఆనంద్ దేవరకొండ తో పలువురు దర్శక నిర్మాతలు సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారు . విజయ్ దేవరకొండ తో చేయాలనుకున్న వాళ్ళు అతడి డేట్స్ దొరక్క ఇలా తమ్ముడితో చేస్తున్నారు .