విజయ్ దేవరకొండ తమ్ముడి చిత్రం 90 శాతం పూర్తి


Anand devarakonda shivatmika Dorasani 90 % shooting completed

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే . మహేంద్ర అనే యువ దర్శకుడి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు కాగా ఆ సినిమా టైటిల్ ”దొరసాని ” . హీరో డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక దొరసాని గా నటిస్తోంది . శివాత్మిక కు కూడా ఇదే మొదటి చిత్రం . ఇక ఈ సినిమా దాదాపుగా 90 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది .

 

గత నెలలో వరంగల్ పరిసర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్ జరుపుకుంది . తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ని వాడుకోవాలని చూస్తున్నారు . అలాగే సీనియర్ హీరో రాజశేఖర్ ని కూడా . హీరోల సోదరులు హీరోలుగా నటించినప్పటికీ సక్సెస్ అయిన సందర్భాలు తక్కువే అని చెప్పాలి . వేళ్ళ మీద లెక్క పెట్టగలిగే హీరోలు మాత్రమే సక్సెస్ అయ్యారు మిగతా వాళ్ళు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు . మరి విజయ్ దేవరకొండ తమ్ముడు హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా చూడాలి .

English Title: Anand devarakonda shivatmika Dorasani 90 % shooting completed