కొత్త బిజినెస్‌లోకి ఎంట‌రైన రౌడీ బ్ర‌ద‌ర్‌!

కొత్త బిజినెస్‌లోకి ఎంట‌రైన రౌడీ బ్ర‌ద‌ర్‌!
కొత్త బిజినెస్‌లోకి ఎంట‌రైన రౌడీ బ్ర‌ద‌ర్‌!

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ డ‌బుల్ జోష్‌లో వున్నాడు. `దొర‌సాని` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ రౌడీ బ్ర‌ద‌ర్‌కు తొలి మూవీ ఆశించిన‌ స్థాయిలో సక్సెస్‌ని అందించ‌లేక‌పోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని సాలీడ్ స్టోరీతో ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని `మిడిల్ క్లాస్ మెలోడీస్`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ మూవీ సూప‌ర్‌హిట్ గా నిలిచి ఆనంద్ దేవ‌ర‌కొండ‌కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్‌లో వున్న ఈ రౌడీ బ్ర‌ద‌ర్ తాజాగా కొత్త బిజినెస్ లోకి ఎంట‌ర‌య్యార‌ట‌. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. “మిడిల్ క్లాస్ మెలోడీస్` మూవీ నాకు తొలి పెద్ద విజ‌యాన్ని, చెక్కును అందించింది. అంతే కాదు మీ ప్రేమ నాలో బ‌లాన్ని, ఆత్మ‌స్తైర్యాన్ని నింపింది. ఈ విజ‌యాన్ని పంచుకుంటూ మొద‌టి అడుగుగా నా స్నేహితుడితో క‌లిసి ఫుడ్ డ్రీమ్స్‌లో పెట్టుబ‌డి పెట్టా. విజ‌య్‌కు, నాకు స‌క్సెస్ ఇచ్చిన సినిమాల‌న్నీ ఫుడ్ చుట్టూ సాగిన‌వే` అన్నారు.

అందుకే నా మొద‌టి పారితోషికంతో మీకు రుచిక‌ర‌మైన ఆహారం తినిపించాల‌ని నా స్నేహితులకు స‌పోర్ట్‌గా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నా. మేమంతా ఎన్నో క‌ల‌లు కంటూ క‌లిసి పెరిగాం` అన్నారు ఆనంద్ దేవ‌ర‌కొండ‌. ఫ్రెండ్స్‌తో క‌లిసి ఏర్పాటు చేసిన హోట‌ల్‌కు `గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్‌` అనే పేరు పెట్టిన‌ట్టు వెల్ల‌డించారు. హైద‌రాబాద్‌లోని ఖాజాగూడ‌లో దీన్ని ఏర్పాటు చేశార‌ట‌.