విజయ్ దేవరకొండ తమ్ముడు మరో సినిమాకు రెడీ

Anand Deverakonda
Anand Deverakonda

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . దొరసాని చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న ఆనంద్ దేవరకొండ వినోద్ అనే యువ దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడట ! త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట కూడా .

దొరసాని చిత్రంలో తెలంగాణ యువకుడిగా నటిస్తుండగా తన రెండో చిత్రంలో ఆంధ్రా యువకుడిగా నటించనున్నాడు .

ఇక దొరసాని చిత్ర విషయానికి వస్తే …….. జూలై 5 న ఈ సినిమాని విడుదల చేయాలనీ అనుకున్నారు అయితే వరల్డ్ కప్ జరుగుతుండటంతో జూలై 12 కు వాయిదావేశారు దొరసాని చిత్రాన్ని . ఈ సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు ఆనంద్ దేవరకొండ హీరోగా సక్సెస్ అవుతాడా ? లేదా ? అన్నది .