మిడిల్ క్లాస్ అబ్బాయి `పుష్ప‌క విమానం`!

మిడిల్ క్లాస్ అబ్బాయి `పుష్ప‌క విమానం`!
మిడిల్ క్లాస్ అబ్బాయి `పుష్ప‌క విమానం`!

`మిడిల్ క్లాస్ మెలోడీస్`‌తో మంచి స‌క్సెస్‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. త‌న కాన్సెప్ట్ మూవీని కూడా మధ్యతరగతి నేప‌థ్యంలోనే ఎంచుకున్నాడు. ఈ చిత్రాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి `పుష్పక విమానం` అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు.  కుటుంబం చుట్టూ.. వివాహం చుట్టూ జ‌రిగే నాటకీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ మూవీ సాగ‌బోతోంది.

నిజ జీవిత ప్రేరేపిత పాత్రల ఆధారంగా ఈ చిత్రంలోని పాత్ర‌ల్ని మ‌లిచార‌ట‌. సునీల్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న ఈ చిత్రంలో కథానాయకుడు ఆనంద్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు. సాన్వే మేఘన, గీత్ సైని ఈ చిత్రంలో హీరోయిన్‌లుగా కనిపించనున్నారు.

కొత్త ద‌ర్శ‌కుడు  దామోదర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామాను ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించారు.  కింగ్ ఆఫ్ ది హిల్ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై హీరో విజయ్ దేవరకొండ సమర్పించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. సోమ‌వారం ఈ చిత్ర టైటిల్ ఫ‌స్ట్ లుక్‌ని హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రిలీజ్ చేశారు.