వేశ్య పాత్ర‌లో అనసూయ?

Anasuya bharadwaj To Play Prostitute
Anasuya bharadwaj To Play Prostitute

బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు తెచ్చుకున్న అన‌సూయ ఆ త‌రువాత న‌టిగా మారిన విష‌యం తెలిసిందే. అనసూయ భరద్వాజ్ న‌టిగా స‌రికొత్త పాత్ర‌ల్లో న‌టించ‌డానికి మాత్రం ప్రాధాన్య‌త నిస్తోంది. అలా ఆమె `రంగస్థలం` లో రంగమ్మత్త‌ క్యారెక్టర్ చేసి న‌టిగా మ‌రింత గుర్తింపుని, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది.

ప్ర‌త్యేక గీతాల్లోనూ న‌టిస్తున్న అనసూయ ప్ర‌స్తుతం`థాంక్స్ యు బ్రదర్` లో గర్భవతిగా కనిపిస్తోంది. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధం కాబోతోంది. ఇక కార్తికేయ న‌టిస్తున్న `చావు కబురు చల్లగా`లో ఒక ప్రత్యేక పాట చేస్తోంది. అంతే కాకుండా మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న `ఖ‌లాడీ`లోనూ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది.

ఇదిలా వుంటే అన‌సూయ డైరెక్ట‌ర్‌ మారుతి .. గోపిచంద్ తో చేస్తున్న `పక్కా కమర్షియల్` చిత్రంలో సెక్స్ వర్కర్ గా వేశ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే మారుతి ఆమెని సంప్ర‌దించి క‌థ చెప్పార‌ట‌. పాత్ర న‌చ్చ‌డంతో అనసూయ ఒప్పుకుంద‌ని తెలిసింది. ఇందులో హీరోయిన్‌గా రాశిఖ‌న్నా న‌టించ‌బోతోంది.