అనసూయ ఏమందో తెలుసా


Anasuya clarify on vijay devarakonda film

హాట్ భామ అనసూయ బుల్లితెర మీదనే కాదు వెండితెర మీద కూడా దూసుకుపోతోంది . ఇన్నాళ్లు బుల్లితెర పైనే అందాల ఆరబోతతో సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడు వెండితెర మీద కూడా అందాల విందు కి సిద్ధమైంది . తాజాగా ఎఫ్ 2 లో వెంకటేష్ తో కలిసి ఆడి పాడిన ఈ భామ తాజాగా దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ హీరోగా రూపొందనున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .

ఇంకా సెట్స్ పైకి వెళ్లని ఈ చిత్రంలో అనసూయ గ్లామర్ గా కనిపించనుందని వార్తలు వచ్చాయి అయితే గ్లామర్ గా కాదు కానీ నటిగా డిఫరెంట్ క్యారెక్టర్ చేయబోతున్నాను …… తప్పకుండా నాకు విభిన్నమైన పాత్ర అవుతుందనడంలో సందేహం లేదు అని అంటోంది అనసూయ . స్మాల్ స్క్రీన్ పైనే చిట్టి పొట్టి బట్టలతో అందాల ప్రదర్శన చేస్తున్న ఈ భామ వెండితెర మీద కూడా అందాల ఆరబోతతో మరింతగా మోతెక్కించనుందట . తరుణ్ భాస్కర్ హీరో అయితే హీరోయిన్ అనసూయ ఇక ఈ సినిమాని నిర్మించేది హీరో విజయ్ దేవరకొండ .

English Title: Anasuya clarify on vijay devarakonda film