అనసూయ ఎందుకలా అంది


Anasuya comments on metoo

టాలీవుడ్ లో మహిళలను వేధించేవాళ్ళు తక్కువ అని , అసలు ఇక్కడ అంతగా భయపడాల్సిన అవసరం లేదని లైంగిక వేధింపుల విషయాన్నీ చాలా లైట్ గా తీసుకుంది హాట్ యాంకర్ అనసూయ . అసలు టాలీవుడ్ లోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఆరోపిస్తూ వివాదాస్పద నటి శ్రీ రెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . శ్రీ రెడ్డి ఈ వివాదాన్ని రాజేసిన తర్వాతే దేశవ్యాప్తంగా మీ టూ అంటూ పెద్ద ఉద్యమం మొదలైంది . పలువురు హీరోయిన్ లు కూడా మేము కూడా బాధితులమే అంటూ మీడియా ముందుకు వచ్చారు , ఇక సోషల్ మీడియాలో అయితే లెక్కేలేదు .

అయితే లైంగిక వేధింపుల పై కామెంట్ చేసిన అనసూయ టాలీవుడ్ లో మాత్రం పెద్దగా ఆ ప్రభావం లేడని సెలవిచ్చింది విచిత్రంగా . ఈమద్యే చిన్మయి కూడా పలువురు బాధితుల స్క్రీన్ షాట్ లను వదులుతోంది . కానీ అనసూయ మాత్రం ఆ విషయాన్నీ లైట్ గా తీసుకుంది . హాట్ యాంకర్ గా బుల్లితెరని ఓ ఊపు ఊపేస్తున్న ఈ భామ సినిమాల్లో కూడా నటిస్తోంది . జబర్దస్త్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది అనసూయ .

English Title: Anasuya comments on metoo