సైబ‌ర్ క్రైమ్ పోలీస్‌ల‌ని ఆశ్రయించిన యాంక‌ర్‌!


సైబ‌ర్ క్రైమ్ పోలీస్‌ల‌ని ఆశ్రయించిన యాంక‌ర్‌!
సైబ‌ర్ క్రైమ్ పోలీస్‌ల‌ని ఆశ్రయించిన యాంక‌ర్‌!

క‌రోనా కార‌ణంగా దేశం భ‌యంతో వ‌ణికిపోతోంది. రోజు రోజుకీ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ప్ర‌భుత్వం లాకౌట్‌ని ప్ర‌క‌టించింది. జ‌న‌తా క‌ర్ఫ్యూని తెలంగాణ‌లో ఈ నెల 31 వ‌ర‌కు కొన‌సాగించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. సీఎస్ ఈ మేర‌కు అధికారికంగా ఉత్త‌ర్వుల‌ని జారీ చేశారు.

ఇదిలా వుంటే స‌ర్వం బంద్ పాటిస్తే మా లాంటి వాళ్ల‌కు ప‌నివుండ‌దు. ఇఎంఐలు, రెంట్‌లు క‌ట్ట‌డం క‌ష్ట‌మ‌వుతుంది. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ఏమైనా చర్య‌లు తీసుకుంటుందా? అన్న‌ట్టుగా అన‌సూయ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేసింది. దీనిపై నెటిజ‌న్స్ తీవ్ర స్థాయిలో స్పందించారు. అన‌సూయ ఎంత న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా నెటిజ‌న్స్ విన‌కుండా విమ‌ర్శ‌లు కురిపిస్తుండ‌టంతో చేసేది లేక అన‌సూయ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించింది.

త‌న‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్ చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని వ్రాత‌పూర్వ‌కంగా కంప్లైంట్‌ని రాసిచ్చేసింది. గ‌త కొంత కాలంగా అన‌సూయ సోష‌ల్ మీడియాలో త‌న‌పై అస‌భ్యంగా కామెంట్లు చేస్తున్నారంటూ సైడ‌ర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్ర‌యించింది. తాజాగా మ‌రోసారి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల్ని సంప్ర‌దించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.