రోజాపై పక్క షో లో పంచ్ వేసిన అనసూయ


Anasuya controversial comments on Roja
Anasuya controversial comments on Roja

నగరి ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ లో మొదటి నుండి జడ్జ్ గా ఉన్న సంగతి తెల్సిందే. దీంతో పాటు బతుకు జట్కా బండి షో కూడా ఆమె నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే రోజాతో పాటే మొదటినుండి జబర్దస్త్ లో పనిచేస్తూ వచ్చిన అనసూయ ఇప్పుడు జీ టీవీ కార్యక్రమం లోకల్ గ్యాంగ్స్ లో జడ్జ్ గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. షో ఏదైనా తన గ్లామర్ షో తో వెనక్కి తగ్గని అనసూయ, ఇటీవలే ఫైర్ బ్రాండ్ రోజాపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వ్యాఖ్యలు సరదాగా చేసినట్లే ఉన్నా కూడా అందులోని అర్ధం రోజాకు వ్యతిరేకంగానే ఉంది.

లోకల్ గ్యాంగ్స్ కు సంబంధించిన ప్రోమో ఒకటి రీసెంట్ గా విడుదల చేసారు. అందులో శేఖర్ మాస్టర్ తో కలిసి బలపంపట్టి సాంగ్ తో తనదైన శైలిలో డ్యాన్స్ చేసి అలరించింది అనసూయ. అదే ప్రోమోలో యాంకర్ గా చేస్తున్న ప్రదీప్ “మీ శేఖర్ ఇంకెక్కడ రోజా గారు.. మీ శేఖర్ లేదింకా” అని సరదాగా ఇక్కడికి వచ్చేసిన విషయాన్ని చెప్తుంటే మధ్యలో అనసూయ కల్పించుకుని “అం అహా వరకూ వెళ్లిపోయారు” అని చెప్పడం వరకూ బాగానే ఉంది. దానికి ప్రదీప్ కొనసాగింపుగా ఈ తీవ్రమైన చర్చను ఎక్కడ చర్చిస్తారు మేడం అని అనగానే బండిలో (బతుకు జట్కా బండి) అని అనసూయ అనడం, దానికి ప్రదీప్ రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు కొంచెం ఫ్రీ పెట్టుకోమంటున్నారు సార్ అని అనగానే దానికి అనసూయ మరి ఆవిడ యాంకరింగా లేక పక్కన పార్టీనా అని గట్టిగా నవ్వేసింది. దానికి శేఖర్ మాస్టర్ కూడా ఏంటిది అన్నట్లు బిత్తరపోవడం గమనించవచ్చు.

హాయిగా యాంకరింగ్ చేసుకుంటున్నావ్, జడ్జ్ గా కూడా ఉన్నావ్ మరెందుకీ వివాదాలు అంటూ ఆ ప్రోమో కింద కామెంట్లు పడుతున్నాయి. అనసూయ చెప్పింది స్క్రిప్ట్ లో రాసిందే కావొచ్చు కానీ అక్కడ అనసూయ చెప్పినట్లేగా ఉండేది. మరి ఇది వివాదమవుతుందో లేక రోజా కూడా సరదాగా అనుకుని లైట్ తీసుకుంటుందో చుడాలి.