నెటిజ‌న్ కామెంట్‌పై అన‌సూయ స్ట్రాంగ్ రిప్లై‌!

Anasuya counter to a netizen
Anasuya counter to a netizen

పోష‌ల్ మీడియా వ‌ల్ల మంచే కాదు చెడు కూడా వుంది. అందుకే సోష‌ల్ మీడియా వేదిక‌గా కామెంట్ చేయ‌డానికైనా.. ఏదైనా పోస్ట్ పెట్ట‌డానికైనా సెల‌బ్రిటీలు భ‌య‌ప‌డుతుంటారు. కొంత మంది ఇవేవీ ప‌ట్టించుకోకుండా త‌మ‌కు న‌చ్చిన పోస్ట్‌లు పెడుతూ నెటిజ‌న్‌లకు అడ్డంగా బుక్క‌వుతుంటారు. గ‌త కొంత కాలంగా యాంక‌ర్‌, న‌టి అన‌సూయ సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌ల‌కు గుర‌వుతూ వ‌స్తోంది.

త‌ను పెట్టే పోస్ట్‌ల వ‌ల్ల నెటిజ‌న్‌ల ట్రోలింగ్‌కి గుర‌వుతూనే వుంది. తాజాగా మ‌రో సారి నెటిజ‌న్‌ల చేతిలో అడ్డంగా బుక్కైంది. `అఆ` చిత్రంలో చ‌మ్మ‌క్ చంద్ర పెళ్లి చూపుల సీన్ అంద‌రికి గుర్తుండే వుంటుంది. ఈ స‌న్ని వేశంలో స‌మంత నితిన్‌ని భావా ఒక్క మాట..` అంటూ చేసే హంగామా అంద‌రికి తెలిసిందే. లంగా ఓణీలో స‌మంత‌ని త‌ల‌పిస్తూ డోర్ ప‌క్కన నిల్చుని అన‌సూయ ఫొటోల‌కు పోజులిచ్చింది.

ఈ ఫొటోపై ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. నువ్వేమైనా స‌మంత అనుకుంటున్నావా.. అంటూ మీమ‌మ్‌ని క్రియేట్ చేసి కామెంట్ చేశాడు. దీనికి స్ట్రాంగ్ గానే రిప్లై ఇచ్చింది అన‌సూయ‌. అయ్యే లేద‌మ్మా న‌న్ను అన‌సూయ అంటారు` అంది. వెంట‌నే తేరుకున్న నెటిజ‌న్ `క్ష‌మించండి మేడమ్ ఆట‌ప‌ట్టించడం కోసం నేను స‌ర‌దాగా అన్నాను` అని ట్వీట్ చేశాడు.దానికి అన‌సూయ మ‌ళ్లీ కౌంట‌రేసింది. `నాక‌ర్థ‌మైంది నువ్వు చిన్న‌పిల్లాడివేన‌ని.. నువ్వు త్వ‌ర‌గా ఎద‌గాల‌ని నేను కోరుకుంటున్నా` అని కౌంట‌రిచ్చింది.