వెబ్ సిరీస్ లోకి అనసూయ


Anasuya enter into web series
Anasuya enter into web series

హాట్ భామ అనసూయ వెబ్ సిరీస్ నిర్మించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది . ఇన్నాళ్లు బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ భామ అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తోంది . అయితే సినిమా నిర్మాణం కంటే వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ ఉండటం అలాగే పెట్టిన పెట్టుబడి కి గ్యారెంటీ ఉండటంతో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోందట .

జబర్దస్త్ తో సంచలనం సృష్టించిన ఈ భామ ఒకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది . దాంతో వెల్లువలా వచ్చి పడుతున్న డబ్బుని ఇలా వెబ్ సిరీస్ లు తీయడానికి తద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి పెద్ద ప్రయత్నమే చేస్తోంది రంగమ్మత్త . మంచి కథ దొరికితే ఇన్స్పైర్ చేయగలిగితే సినిమా కూడా నిర్మిస్తుందట.