సోషల్ మీడియా పై నిప్పులు కక్కిన అనసూయ


Anasuya fires on netizens

హాట్ భామ అనసూయ సోషల్ మీడియా లో తనపై వస్తున్న కథనాలపై నిప్పులు కక్కింది. యు ట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు మా లాంటి వాళ్లపై అనవసరమైన , నిరాధారమైన వార్తలను రాస్తూ సొమ్ము చేసుకుంటున్నారని , అలా రాసే తప్పుడు రాతల వల్ల మా కుటుంబం బాధపడుతుందని కనీస జ్ఞానం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మీరు రాసే రాతల వల్ల మా కుటుంబం రోడ్డున పడితే మమ్మల్ని పోషించేది ఎవరు ? మీలాగా బ్రతకాలన్నా కూడా కుదరదు ? అలాంటప్పుడు మేము ఏ ఉద్యోగం చేసుకోవాలి అంటూ నిప్పులు చేరుగుతోంది అనసూయ.

జబర్దస్త్ ప్రోగ్రాం తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న ఈ భామ పై యూ ట్యూబ్ ఛానల్ లలో అలాగే కొన్ని వెబ్ సైట్ లలో ఘోరంగా రాస్తున్నారు. ఇక యూ ట్యూబ్ లో అయితే మరీ దారుణంగా అనసూయ పై కథనాలు వండి వారుస్తున్నారు. ఆ కథనాలు అనసూయ కంట పడటంతో ఆవేశానికి లోనయ్యింది. ఇక ఫేస్ బుక్ , వాట్సాప్ , ట్విట్టర్ లలో అయితే అనసూయ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఈ భామ బుల్లితెర పై అందాలను ఆరబోస్తూ కుర్రకారు కి నిద్ర లేకుండా చేస్తుండటంతో రాతలకు అంతేకాకుండా పోయింది. దాంతో అనసూయ కుటుంబం కూడా చాలా బాధపడుతోందట . అందుకే అనసూయ ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

English Title: anasuya fires on netizens