అన‌సూయ ఆ ఆఫ‌ర్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా?


అన‌సూయ ఆ ఆఫ‌ర్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా?
అన‌సూయ ఆ ఆఫ‌ర్‌కి గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తుందా?

బుల్లితెర‌పై త‌న‌దైన మార్కు మెస్మ‌రిజంతో ప్రేక్ష‌కుల్ని ఆక్టుకుంటంది అన‌సూయ‌. అదే స్థాయికి మించి వెండితెర‌పై విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ర‌క్తిక‌ట్టిస్తోంది. `రంగ‌స్థ‌లం` చిత్రంతో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన అన‌సూయ సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తోంది. న‌టి‌గా త‌న‌కు మంచి పేరుని తెచ్చే పాత్ర‌ల్లోమాత్రమే న‌టించ‌డానికి అంగీక‌రిస్తోంది.

ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి – కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న `ఆచార్య‌` చిత్రంతో పాటు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న `వ‌కీల్‌సాబ్‌`, అల్లు అర్జున్ `పుష్ప‌`,  గ‌త కొంత కాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వుంటూ వ‌చ్చిన క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న `రంగ‌‌మార్తాండ‌`, .. `అంధాదూన్‌` రీమేక్ ఆధారంగా నితిన్ న‌టిస్తున్న రీమేక్ చిత్రంలోనూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న అన‌సూయ‌కు తాజాగా బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించిన‌ట్టు తెలిసింది.

అది బాలీవుడ్ ఆఫ‌ర్. అయితే అది సినిమా ఆఫ‌ర్ కాద‌ని, ఓ ఫేమ‌స్ టీవీ సీరియ‌ల్ కోస‌మ‌ని తెలిసింది. అయితేనేం అందు కోసం అన‌సూయ‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. మ‌రి వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా వున్న అన‌సూయ బాలీవుడ్ ఆఫ‌ర్‌ని ఓకే అంటుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే అంటున్నారు.