`చావు క‌బురు చ‌ల్ల‌గా` కోసం అన‌సూయ గ్లామ‌ర్ ట్రీట్‌!

`చావు క‌బురు చ‌ల్ల‌గా` కోసం అన‌సూయ గ్లామ‌ర్ ట్రీట్‌!
`చావు క‌బురు చ‌ల్ల‌గా` కోసం అన‌సూయ గ్లామ‌ర్ ట్రీట్‌!

`Rx100` ఫేమ్ కార్తీకేయ గుమ్మ‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం `చావు కబురు చల్లగా`. ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై టాలెంటెడ్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ విభిన్న‌మైన క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో అనసూయ `పైన ప‌టారం.. ` అంటూ సాగే ప్రత్యేక గీతంలో మెరుపులు మెరిపించినున్న‌ట్టు తెలిసింది.  ఈ పాట‌కు సంబంధించిన స్టిల్స్ ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్  అయ్యాయి. అన‌సూయ గ్లామ‌ర్ ట్రీట్ గా నిల‌వ‌నున్న ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియోని మేకర్స్ ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నారు.

ప్రోమో యొక్క ప్రీ లుక్ పోస్ట‌ర్ ని తాజాగా రిలీజ్ చేశారు. అనసూయ ఈ పోస్ట‌ర్‌పై మెరిసిపోతోంది.  ‘పైనా పటారాం’ పాటలో  అన‌సూయ గ్లామ‌ర్ ట్రీట్ ఇవ్వ‌బోతోంద‌ని ఆమె అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నార‌ట‌. ఈ పాటలో అన‌సూయ‌ ప్రేక్ష‌కుల్నిలను ఆకట్టుకునే స్టాయిలో మెస్మ‌రైజ్ చేయ‌బోతోంద‌ని చెబుతున్నారు. కొత్త ద‌ర్శ‌కుడు కౌశిక్ దర్శకత్వం వహించిన `చావు కబురు చల్లగా` మార్చి 19 న విడుదల కాబోతోంది. ఈ మూవీకి అన‌సూయ గ్లామ‌ర్ ట్రీట్ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని చెబుతున్నారు.