సునీల్‌తో రొమాన్స్‌కి రంగ‌మ్మ‌త్త రెడీ?

సునీల్‌తో రొమాన్స్‌కి రంగ‌మ్మ‌త్త రెడీ?
సునీల్‌తో రొమాన్స్‌కి రంగ‌మ్మ‌త్త రెడీ?

హీరో నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మ‌ళ్లీ కొత్త ప్ర‌యాణం మొద‌లుపెట్టిన సునీల్ మ‌రో ప‌క్క హీరోగానూ న‌టిస్తున్నారు. ఆయ‌న హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `వేదాంతం రాఘ‌వ‌య్య‌`. చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ క‌థ అందిస్తూ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ మూవీ ఇటీవ‌లే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

త్వ‌ర‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో రంగ‌మ్మ‌త్త అన‌సూయ హీరో సునిలీకి జోడీగా న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్ర బృందం ఇటీవ‌లే అన‌సూయ‌ని సంప్ర‌దించి ఆమెతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని, హీరోయిన్‌గా ఆమెనే ఫైన‌ల్ చేయ‌బోతున్నార‌ని వినిపిస్తోంది. ఇటీవ‌లే ఆమెకు ద‌ర్శ‌కుడు చంద్ర‌మోహ‌న్ స్క్రిప్ట్ వినిపించార‌ట‌. ఆమె ఫైన‌ల్ కాల్ కోసం టీమ్ ఎదురుచూస్తున్న‌ట్టు చెబుతున్నారు.

అన‌సూయ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తే `వేదాంతం రాఘ‌వ‌య్య‌` రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభం అవుతుంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దాము న‌ర్రావుల ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. అన‌సూయ ఇటీవ‌లే నిహారిక నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌ని అంగీక‌రించింది. దీనితో పాటు ఆమె చేతిలో `ఆచార్య‌`, పుష్ప‌`, రంగ మార్తాండ చిత్రాలున్నాయి.