పొట్ట క‌దిలిస్తూ అన‌సూయ హాట్ యోగా!


పొట్ట క‌దిలిస్తూ అన‌సూయ హాట్ యోగా!
పొట్ట క‌దిలిస్తూ అన‌సూయ హాట్ యోగా!

బుల్లితెర యాంక‌ర్‌గా అన‌సూయ‌కు మంచి పేరున్న విష‌యం తెలిసిందే. అదే స్థాయిలో వెండితెర‌పై కూడా త‌న‌దైన మార్కుని క్రియేట్ చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి ఆక‌ట్టుకున్న అన‌సూయ ఆ త‌రువాత కూడా అదే త‌ర‌హా భిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల్ని అల‌రించాల‌ని చూస్తోంది. ప్ర‌స్తుతం కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న `రంగ మార్తాండ‌`తో పాటు అల్లు అర్జున్ న‌టిస్తున్న `పుష్ప‌`, మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `ఆచార్య‌` చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోంది.

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ మూడు చిత్రాల షూటింగ్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డింది. క‌రోనా కంట్రోల్ అయితే త‌ప్ప ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం కాని ప‌రిస్థితి. సినీ ఇండస్ట్రీ ప‌రిస్థితి ఇలా వుంటే గ‌త మూడున్న‌ర నెల‌లుగా టీవీ ఇండ‌స్ట్రీ కూడా ఎలాంటి షూటింగ్‌లు చేయ‌కుండా బంద్ పాటిస్తోంది. తాజాగా కొన్ని సీరియ‌ల్స్ షూటింగ్ ప్రారంభించిన న‌టీన‌టుల‌కు కొంత మందికి క‌రోనా సోక‌డంతో కొన్ని టీవీ సీరియ‌ల్స్ షూటింగ్ ఆపేశారు. అన‌సూయ టీవీ షో చేయాల‌నుకున్నా క‌రోనా దెబ్బ‌తో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకుంది.

గ‌త కొన్ని నెల‌లుగా ఇంటి ప‌ట్టునే వుంటున్న అన‌సూయ తాజాగా ఓ హాట్ యోగాని ట్రైచేసింది. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. పొట్ట క‌దిలిస్తూ రామ్‌దేవ్ బాబా త‌ర‌హాలో అన‌సూయ చేసిన హాట్ యోగా నెటిజ‌న్స్‌ని ఎట్రాక్ట్ చేస్తోంది. హాఫ్ స్క‌ర్ట్, హాఫ్ టీష‌ర్ట్ వేసుకుని పొట్ట‌ని క‌దిలిస్తూ అన‌సూయ చేసిన హాట్ యోగాపై నెటిజ‌న్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.