ఫొటోస్టోరీ: ర‌ంగ‌మ్మ‌త్త‌ ర‌చ్చ‌ను ప‌ట్టించుకోరే!


ఫొటోస్టోరీ: ర‌ంగ‌మ్మ‌త్త‌ ర‌చ్చ‌ను ప‌ట్టించుకోరే!
ఫొటోస్టోరీ: ర‌ంగ‌మ్మ‌త్త‌ ర‌చ్చ‌ను ప‌ట్టించుకోరే!

అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌.. బుల్లితెర‌పై ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరిది. ఫిల్మ్ ఆడియో ఈవెంట్‌ల హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ రంగ‌మ్మ‌త్త‌ టెలివిజ‌న్‌ యాంక‌ర్‌గా, న‌టిగా మంచి పాపులారిటీనే సొంత చేసుకుంది. బీహారీని పెళ్లాడిన అన‌సూయ సినిమాల్లో న‌టిగా స్థిర‌ప‌డాల‌ని, వెండి తెర‌పై త‌న స‌త్తా చాటు కోవాల‌ని చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. న‌టిగా ప‌ద‌హారేళ్ల క్రిత‌మే ఎన్టీఆర్ న‌టించిన `నాగ‌` సినిమాతో తెరంగేట్రం చేసినా ఆ చిత్రం అన‌సూయ‌కు చెప్పుకోద‌గ్గ గుర్తింపుని అందించ‌లేక‌పోయింది. దాంతో మ‌ళ్లీ బుల్లితెర‌నే న‌మ్ముకున్న ఆమె అక్క‌డే త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుని బుల్లితెర యాంక‌ర్‌గా మంచి గుర్తింపునే సొంతం చేసుకుంది.

నాగార్జున న‌టించిన `సోగ్గాడే చిన్నినాయ‌నా` సినిమాతో మ‌ళ్లీ వెండితెర‌పై మెరిన ఈ బుట్ట‌బొమ్మ ఆ త‌రువాత వ‌రుస ఆఫ‌ర్ల‌ని అందిపుచ్చుకుంది. `విన్న‌ర్‌`లో స్పెష‌ల్ గీతం చేసినా రాని గుర్తింపు లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ చేసిన `రంగ‌స్థ‌లం`తో వ‌చ్చింది. ఇందులో అన‌సూయ రంగ‌మ్మ‌త్త‌గా అద‌ర‌గొట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ పోషించిన చిట్టిబాబు పాత్ర‌కు ఏ స్థాయి ప్ర‌శంస‌లు ద‌క్కాయో అదే స్థాయి ప్ర‌శంస‌లు రంగ‌మ్మ‌త్త పాత్ర‌కు ల‌భించాయి. అయితే ఆ త‌రువాత అన‌సూయ త‌న‌ని వెతుక్కుంటూ మంచి పాత్ర‌లొస్తాయ‌ని ఆశ‌ప‌డింది. కానీ ప‌రిస్థితి మారింది. ప్ర‌యారిటీ త‌గ్గింది.
బుల్లితెర‌పై కూడా ఆ ప‌రిస్థితి రాకూడ‌ద‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతోంది.

బుల్లితెర‌పై ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం కోసం చిట్టిన‌డుముని చూపిస్తూ ఆప‌సోపాలు ప‌డుతోంది. డ్రెస్సింగ్
స్టైల్‌ని కూడా మార్చిన అన‌సూయ త‌ను హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌ల‌కు ఎక్స్‌ట్రా క‌ల‌రింగ్ ఇస్తోంది. అంతేకాకుండా వ‌రుస హాట్ ఫొటో షూట్‌ల‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. ఇలా అయినా త‌ను చేసే ర‌చ్చ‌ని ప‌ట్టించుకుంటారేమోన‌ని, సినిమాల్లో ప్రాముఖ్య‌త వున్న పాత్ర‌ల్ని ఆఫ‌ర్ చేస్తార‌ని హ‌డావిడీ చేస్తోంది. మ‌రి రంగ‌మ్మ‌త్త ర‌చ్చ‌ను టాలీవుడ్ డైరెక్ట‌ర్‌లు ఇప్ప‌టికైనా ప‌ట్టించుకుని ఆమెకు త‌గ్గ పాత్ర‌ల్ని ఇస్తారో లేదో చూడాలి.

 

View this post on Instagram

 

I decide my Vibe. For #LocalGangs #tonyt #DrapeStories from #GauriXAnasuya ?? @gaurinaidu ❤️ PC: @kalyanchatha6840 ?

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

Credit: Instagram