అనసూయకు మరొక అద్భుతమైన అవకాశం


అనసూయకు మరొక అద్భుతమైన అవకాశం
అనసూయకు మరొక అద్భుతమైన అవకాశం

తెలుగువారి మన:సాక్షి.. సాక్షి న్యూస్ ఛానల్ లో యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనసూయ, ఆ తర్వాత కొద్ది రోజులకు బుల్లితెరపై యాంకర్ గా మారి ఎంటర్టైన్మెంట్ రంగంలో విశేషంగా రాణిస్తోంది. తాజాగా సినిమాల్లో కూడా మంచి పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని పొందింది. పక్షులలో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ నీళ్లల్లో తిరిగినంత మాత్రాన అన్నీ హంసలు కావు. అలా వినోద రంగంలో అందంగా ఉన్నామనుకుంటూ, మనకు కనిపించే ఎన్నో బాతులు, కొంగల మధ్యలో మనకు తెలియని ఒక “హంస” అనసూయ. ఆమె ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఉదాహరణ సరిపోతుంది .

అడవి శేష్ హీరోగా వచ్చిన క్షణం సినిమాలో ఒక మంచి పాత్రలతో మనల్ని ఆకట్టుకున్న అనసూయ ఆ తర్వాత సుకుమార్ గారు తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా రెండు తెలుగు రాష్ట్రాల లోని అభిమానుల మనసుల్లో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలోనే తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు కొత్తగా వచ్చే దర్శకులు కేవలం ఇద్దరూ ఆర్టిస్టులకు మాత్రమే సపరేట్ గా క్యారెక్టర్ లు డిజైన్ చేసుకుని స్క్రిప్ట్ లు రాసుకుంటున్నారు. వారిలో ఒకరు విలక్షణ నటుడు రావు రమేష్ గారు అయితే మరొకరు మన తెలుగు హంస అనసూయ.

ప్రస్తుతం అనసూయ అటు టెలివిజన్ రంగం సినిమా రంగంలో బిజీబిజీగా గడిపేస్తోంది. అయితే తాజాగా ఆమెకు వచ్చిన మరొక అవకాశం గురించి తెలుసుకొని అందరూ వావ్.. అద్భుతం అంటున్నారు.ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్న అనసూయ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఒక పిరియాడిక్ సినిమాలో కూడా ఒక మంచి పాత్ర చేస్తోందట . సినిమాలో ఆ పాత్ర ఎంతో హైలెట్ గా ఉంటుందని సినిమా యూనిట్ చెబుతున్నారు. అంతే మరి టాలెంట్ ఉంటే మెగా ఫ్యామిలీ వెళ్లి పెట్టదు కదా..! అందులోనూ అనసూయ అంటే ఇప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన ఆర్టిస్ట్. ఇప్పటికే దర్శకుడు క్రిష్ ఆమెకు లుక్ టెస్ట్ చేయడంతోపాటు, పాత్రకు సంబంధించిన అన్ని రకాల ఇన్ ఫుట్స్ ఆమెతో చర్చించినట్లు తెలుస్తోంది.