`ఖిలాడీ`లో అన‌సూయ క్యారెక్ట‌ర్ ఇదేనా?

`ఖిలాడీ`లో అన‌సూయ క్యారెక్ట‌ర్ ఇదేనా?
`ఖిలాడీ`లో అన‌సూయ క్యారెక్ట‌ర్ ఇదేనా?

మాస్ రాజా ర‌వితేజ న‌టిస్తున్న రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఖిలాడీ`. ర‌మేష్వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  ఏ హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్‌, జ‌యంతీలాల్ గ‌డ స‌మ‌ర్ప‌ణ‌లో పెన్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై కోనేరు స‌త్య‌నారాయ‌ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది.

ఈ చిత్రానికి మ‌రింత గ్లామ‌ర్‌ని మేక‌ర్స్ యాడ్ చేస్తున్నారు. ఇందులో హీరో ర‌వితేజ‌తో ముగ్గురు రొమాన్స్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే వారిని టీమ్ ఎంపిక చేసింది కూడా. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతీల‌ని ఇప్ప‌టికే డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ ఫిక్స్ చేశారు. తాజాగా `రంగ‌స్థ‌లం` రంగ‌మ్మ‌త్త అన‌సూయ‌ని ఫైన‌ల్ చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

అన‌సూయ ఆగ్ర‌హారంలో వుండే టిపిక‌ల్ బ్ర‌హ్మ‌ణ యువ‌తిగా క‌నిపించ‌నుంద‌ట‌. పాత్ర పేరు చంద్ర‌లేఖ‌. ఇద్ద‌రు హీరోయిన్‌లు వున్నా అన‌సూయ క్యారెక్ట‌ర్‌కు మంచి ప్రాధాన్య‌త వుంటుంద‌ని చెబుతున్నారు. ఓ త‌మిళ థ్రిల్ల‌ర్ ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. అయితే అది ఏ మూవీ అన్న‌ది మాత్రం మేక‌ర్స్ గానీ, డైరెక్ట‌ర్ గానీ రివీల్ చేయ‌డం లేదు.