నెటిజన్లు తిట్టడంతో అకౌంట్ డిలీట్ చేసిన అనసూయ


ఓ మహిళ ఫోన్ ని అనసూయ పగులగొట్టిందని నెటిజన్ల కు తెలియడంతో కోపం పట్టలేక అనసూయ పై తిట్ల వర్షం కురిపించారు దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన అనసూయ సోషల్ మీడియాలో ఉన్న తన అకౌంట్ లను డిలీట్ చేసింది . ట్విట్టర్ , ఫేస్ బుక్ లలో ఉన్న అనసూయ ఎకౌంట్ లను క్లోజ్ చేసింది , ఇంతగా అనసూయ రియాక్ట్ కావడానికి కారణం ఏంటో తెలుసా …… ఓ మహిళ తన స్మార్ట్ ఫోన్ ని అనసూయ పగులగొట్టిందని అలాగే విమర్శలు కూడా చేసిందని పోలీసులను ఆశ్రయించడమే !

ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది అయితే అనసూయ తన వెర్షన్ చెప్పాలని ఎంతగా ప్రయత్నం చేసినా పాపం నెటిజన్ల నుండి ఆమెకు మద్దతు లభించలేదు పైగా అనసూయ పై ఘాటు విమర్శలు వచ్చాయి దాంతో తీవ్ర మనస్థాపానికి గురై వాళ్ళని కంట్రోల్ చేయలేమని , ట్విట్టర్ , ఫేస్ బుక్ లను తాత్కాలికంగా రద్దు చేసుకుంటే బెటర్ అని ఫీలై వాటిని క్లోజ్ చేసింది .