లైవ్‌లో అన‌సూయ దుమ్ము దులిపేసింది!

లైవ్‌లో అన‌సూయ దుమ్ము దులిపేసింది!
లైవ్‌లో అన‌సూయ దుమ్ము దులిపేసింది!

సోష‌ల్ మీడియా వాడ‌కం పెరిగిన ద‌గ్గ‌రి నుంచి నెటిజ‌న్స్ కంట్రోలింగ్ త‌గ్గిపోయింది. ఎవిరికి తోచింది వారు విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. లైవ్‌లోనే సెల‌బ్రిటీల‌ని ఆడుకుంటున్నారు. కొంత మంది లైట్ తీసుకుంటుంటే కొంత మంది మాత్రం నెటిజ‌న్స్‌పై మండిప‌డుతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో పాపుల‌ర్ అయిన అనసూయ నెటిజ‌న్స్‌పై మండిప‌డుతోంది.

గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన అన‌సూయ ఇట‌వ‌ల లైవ్‌లో నెటిజ‌న్‌ని ఏకి పారేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఓ పక్క సినిమాల్లో న‌టిస్తూనే మరో ప‌క్క రియాలిటీ షోల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తూనే త‌న‌కు కౌంట‌ర్ ఇచ్చిన వారిని త‌న మాట‌ల తూటాల‌తో ఎన్ కౌంట‌ర్ చేస్తోంది.

రీసెంట్‌గా ఓ లైవ్ చాట్‌లో ఓ నెటిజ‌న్ వేసిన త‌ల‌తిక్క ప్ర‌శ్న‌కు అంతే రేంజ్‌లో అన‌సూయ క‌డిగిపారేసింది. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం కోసం తాము ఎంత క‌ష్ట‌ప‌డుతున్నామో వివ‌రిస్తూనే చుర‌క‌లంటించింది. నీక‌స‌లు బుర్రే లేదంటూ శివ‌తాండ‌వం చేసింది. దీంతో నెటిజ‌న్ దెబ్బ‌కి సైలెంట్ అయిపోయాడు. అన‌సూయ ప్ర‌స్తుతం `పుష్ప‌`, రంగ మార్తాండ‌, ఆచార్య వంటి క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది.