అనసూయ ఫోటో వైరల్ అవుతోంది


anasuya still goes viral

రంగమ్మత్త గా రంగస్థలం చిత్రంలో నటించింది హాట్ భామ అనసూయ . అయితే మొన్నటి వరకు రంగస్థలం చిత్రంలో నటిస్తోంది అని తెలుసు కానీ అనసూయ స్టిల్ మాత్రం బయటకు రాలేదు దాంతో ఎలా ఉంటుందో అన్న ఆత్రుత నెలకొని ఉండే అయితే నిన్న ఊహించని విధంగా అనసూయ లుక్ ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం . నిజంగా అనసూయ లుక్ బయటకు రావడమే ఆలస్యం క్షణాల్లో వైరల్ అయ్యింది .

 

ఎందుకంటే డీ గ్లామర్ గా అనసూయ నటించినప్పటికీ ఆ డీ గ్లామర్ లోనే ఏదో గ్లామర్ కొట్టొచ్చినట్లుగా కనిపించింది . అనసూయ గెటప్ బాగుంది దాంతో వైరల్ అవుతోంది ఆ స్టిల్ . రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా నటిస్తోంది అనసూయ , చరణ్ కు అత్తగా నటించడం అంటే ముందు సంకోచించిందట కానీ సుకుమార్ ఒత్తిడితో మంచి పాత్ర చేసానని సంతోషం వ్యక్తం చేస్తోంది ఈ భామ .