మరో బోల్డ్ పాత్రలో అనసూయ?


మరో బోల్డ్ పాత్రలో అనసూయ?
మరో బోల్డ్ పాత్రలో అనసూయ?

హాట్ యాంకర్ గా అనసూయ గురించి పరిచయం అవసరం లేదు. ఇద్దరు పిల్లలకు తల్లైనా, అనసూయ ఒలికించే గ్లామర్ కు కుర్రకారు ఫిదా కాకుండా ఉండలేరు. గ్లామరస్ యాంకర్ లలో అనసూయ స్థానమే వేరు. వరస షోస్ తో బిజీగా ఉండే అనసూయ అడపాదడపా సినిమాల్లో కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత ఆమె ఇమేజ్ మారిపోయింది. సినిమా విడుదలై రెండేళ్లు కావోస్తోన్నా ఇప్పటికీ ఆమెను చూసి రంగమ్మత్త అనే చాలా మంది అంటున్నారంటే ఆ పాత్ర ఒక్క ప్రత్యేకత అలాంటిది. దీని తర్వాత సుకుమార్ చేయబోతున్న అల్లు అర్జున్ సినిమాలో కూడా అనసూయకు ఒక ప్రముఖ పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగస్థలంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే ఇందులో నెగటివ్ ఛాయలున్న పాత్రను పోషించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.

ఇది కాకుండా అనసూయ మరో ఆసక్తికర పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ ఇప్పుడు భీష్మ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా విజయం సాధించిన కొన్ని రోజులకే తన తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధధూన్ సినిమా రీమేక్ చేస్తున్నాడు నితిన్. జూన్ నుండి చిత్రీకరణ జరుపుకోనున్న ఈ చిత్రంలో ఒక బోల్డ్ పాత్రకు అనసూయను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంధధూన్ లో టబు పోషించిన పాత్రను తెలుగులో అనసూయకు ఆఫర్ చేశారట.

పాత్ర పరంగా ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. ఎక్కువ నెగటివ్ ఛాయలున్న ఈ పాత్ర సెకండ్ హాఫ్ లో కీలకంగా ఉంటుంది. పాత్ర పరంగా కూడా బోల్డ్ గా ఉన్న ఈ చిత్రంలో అనసూయ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. నితిన్ సొంత సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ రీమేక్ తెరకెక్కనుంది. డిసెంబర్ కల్లా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇవి కాకుండా రంగ్ దే, చెక్ సినిమాల్లో కూడా నటిస్తున్నాడు నితిన్.