అనసూయ కథనం టీజర్


Anasuya's Kathanam teaser talk 

బుల్లితెర పై జబర్దస్త్ గా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతున్న భామ అనసూయ వెండితెర మీద కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే .ఇప్పటికే క్షణం , రంగస్థలం చిత్రాలతో తన ప్రతిభ ని వెండితెర మీద కూడా చూపించిన అనసూయ తాజాగా కథనం తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది . నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కథనం టీజర్ మహిళా దినోత్సవం సందర్బంగా రిలీజ్ చేసారు .

 

కథనం టీజర్ చూస్తుంటే క్రైం థ్రిల్లర్ అనే విషయం తెలిసిపోతోంది . ఇంతకుముందు కూడా క్షణం చిత్రం క్రైం థ్రిల్లర్ గానే తెరకెక్కింది హిట్ అయ్యింది . మరి ఈ కథనం ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో కానీ ఆసక్తిని అయితే క్రియేట్ చేసింది . అందాల ఆరబోతలోనే కాదు యాక్షన్ లో కూడా తక్కువేమి కాదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది అనసూయ .

English Title : Anasuya’s Kathanam teaser talk