అనసూయ ని ఇబ్బంది పెట్టారట


హాట్ భామ అనసూయ ని స్పైస్ జెట్ ఇబ్బంది పెట్టిందట దాంతో నాకు క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ వేదికగా కోరుతోంది . వేసవి లో తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీరు లోని గుల్ మార్క్ కు వెళ్ళింది . అక్కడ తనవాళ్లతో కలిసి బాగానే ఎంజాయ్ చేసింది, అంతేకాదు అక్కడి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పెట్టేసి హడావుడి చేసింది కూడా . అయితే పనిలో పనిగా స్పైస్ జెట్ నాకు క్షమాపణ చెప్పాలని ట్వీట్ చేసింది .

అందుకు స్పైస్ జెట్ స్పందించి మరింత షాక్ ఇచ్చింది అనసూయ కు . అసలు సంగతి ఏంటో చెప్పండి , పూర్తి వివరాలు అందజేస్తే అప్పుడు స్పందిస్తాం అంటూ ట్వీట్ చేయడంతో అనసూయ కోపం నషాళానికి ఎక్కింది . జబర్దస్త్ తో హాట్ భామగా సంచలనం సృష్టిస్తున్న ఈ భామ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే . అయితే ఈ ట్వీట్ లు ఉన్నాయి కానీ అసలు సమస్య ఏంటో మాత్రం చెప్పలేదు ఈ భామ . బహుశా వెల్లేప్పుడో లేక తిరుగు ప్రయాణంలో స్పైస్ జెట్ వల్ల ఇబ్బందిపడి ఉంటుంది అనసూయ .