ఆ యాంక‌ర్‌ని జీఎస్టీ ఇబ్బందులు ఇంకా వీడ‌లేదా?


Anchor Ansuya in gst trouble
Anchor Ansuya in gst trouble

ఇటీవ‌ల జీఎస్టీ ఇంట‌లిజెన్స్ విభాగం అధికారులు `అందాల రాక్ష‌సి` లావ‌ణ్య త్రిపాఠి, ప్ర‌ముఖ బుల్లితెర యాంక‌ర్‌లు సుమ‌, అనసూయ‌ల‌కు సంబంధించిన ఇళ్ల‌ల్లో సోదాలు నిర్వ‌హించార‌ని, ఆ సోదాల్లో ల‌క్ష‌ల్లో వీరు బ‌కాయిలు ప‌డిన‌ట్టు బ‌య‌ట‌ప‌డిందిని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ ప్ర‌చారంపై యాంక‌ర్ సుమ ఘాటుగా స్పందించారు. తాను క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చాన‌ని, త‌ను గ‌త కొంత కాలంగా స‌క్ర‌మంగానే ట్యాక్సులు క‌డుతున్నాన‌ని, బాధ్య‌త‌గ‌ల మహిళ‌గా ప్ర‌భుత్వానికి ట్యాక్స్ క‌డుతున్నాన‌ని, అలాంటి త‌న‌పై మీడియా లేని పోని నిరాధార‌మైన వార్త‌ల్ని ప్ర‌చురించింద‌ని మండిప‌డింది.

మ‌రో యాంక‌ర్ అన‌సూయ కూడా మీడియా త‌న‌పై నిరాధార‌మైన వార్త‌ల్ని ప్ర‌చురించింద‌ని విరుచుకుప‌డింది. అయితే తాజాగా జీఎస్టీ అధికారులు అస‌లు బండారం బ‌య‌ట‌పెట్టారు. జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌తో పాపుల‌ర్ అయిన అన‌సూయ ఇప్ప‌టికే 25 ల‌క్ష‌లు ట్యాక్స్ పే చేసింద‌ని, మ‌రో 55 ల‌క్ష‌లు క‌ట్టాల్సి వుంద‌ని జీ ఎస్టీ అధికారులు అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టేశార‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అస‌లు క‌ట్టాల్సిందే లేద‌ని చెప్పిన అన‌సూయ ఇలా ఇంకా బ‌కాయి ప‌డ‌టంతో ప‌లువురు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇదిలా వుంటే 66వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో అన‌సూయ `రంగ‌స్థ‌లం` చిత్రానికి గాను ఉత్త‌మ స‌హాయ న‌టిగా అవార్డుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఉత్త‌మ స‌హాయ న‌టిగా అన‌సూయ అందుకున్న తొలి పుర‌స్కారం కావ‌డం విశేషంగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు`, కృష్ణ‌వంశీ రూపొందిస్తున్న `రంగ‌మార్తాండ‌` చిత్రాల్లో న‌టిస్తోంది. ఇందులో `స‌రిలేరు నీకెవ్వ‌రు` జ‌న‌వ‌రి 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.