నటుడు , యాంకర్ హేమంత్ కారు యాక్సిడెంట్


నటుడు , యాంకర్ హేమంత్ కారుకి ప్రమాదం జరిగింది . ఈ యాక్సిడెంట్ లో హేమంత్ కు ఎలాంటి గాయాలు కాలేదు కానీ ఓ గేదె ప్రమాదానికి గురయ్యింది అలాగే హేమంత్ కారు దెబ్బతింది . మహర్షి విజయోత్సవ వేడుక విజయవాడ లో జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ వేడుక కోసం హైదరాబాద్ నుండి విజయవాడకు కారులో వెళ్లిన హేమంత్ ఆ కార్యక్రమాన్ని పూర్తిచేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది .

హేమంత్ పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే . అలాగే యాంకర్ గా కూడా రాణిస్తున్నాడు . కారు ప్రమాదానికి గురైన సమయంలో హేమంత్ డ్రైవింగ్ చేస్తున్నాడు . హేమంత్ కు గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు . అయితే ఈ యాక్సిడెంట్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .