రెండో పెళ్లి చేసుకున్న యాంకర్ భర్త


anchor husband jogi naidu second marriageయాంకర్ , నటి ఝాన్సీ మాజీ భర్త జోగి నాయుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. జోగి నాయుడు నటుడిగానే కాకుండా యాంకర్ గా కూడా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరించి విశేష పేరు ప్రఖ్యాతులు పొందాడు . కాగా అప్పుడే యాంకర్ ఝాన్సీ తో పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో ఇద్దరు కూడా దూరమయ్యారు. అప్పటి నుండి విడిగానే ఉంటున్న జోగి నాయుడు తాజాగా సోజన్య అనే యువతి ని రెండో వివాహం చేసుకున్నాడు.

జోగి నాయుడు అనేక చిత్రాల్లో నటించాడు. యాంకర్ గా కూడా తనదైన ముద్ర వేసాడు అయితే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తడంతో కెరీర్ మందగించింది ఇటు యాంకర్ గా అటు నటుడిగా . ఇన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకోవడంతో కొత్త ఉత్సాహంతో ఉన్నాడు జోగి నాయుడు. మరి ఈ రెండో పెళ్లి తర్వాత కెరీర్ ఊపందుకుంటుందా చూడాలి.

English Title: anchor husband jogi naidu second marriage