తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించిన యాంకర్


సినీ నటి , యాంకర్ ప్రశాంతి తప్పతాగి అసభ్యంగా ప్రవర్తించి వార్తల్లో కెక్కింది . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ప్రశాంతి యాంకర్ అన్న విషయం తెలిసిందే . యాంకర్ గా రాణిస్తున్న ఈ భామ తాజాగా ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి అల్లరి చేసి రచ్చ రచ్చ చేసింది . ఐ పీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో యాంకర్ ప్రశాంతి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తప్పతాగి వచ్చింది .

స్టేడియంలో విపరీతంగా అల్లరి చేస్తుండటంతో పక్కన ఉన్నవాళ్లకు ఇబ్బంది కలిగింది , ఇదేంటని ప్రశ్నించడంతో మరింతగా రెచ్చిపోయిన ప్రశాంతి ఏకంగా స్టేడియంలోని తన బాయ్ ఫ్రెండ్ తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఖిన్నులైన వీక్షకులు పోలీసులకు ఫిర్యాదు చేసారు . కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు . అయితే ప్రశాంతి వీర లెవల్లో రెచ్చిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .