బిగ్ బాస్ పై కేసు నమోదు


Big Boss 3 Telugu
Big Boss 3 Telugu

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ పై కేసు నమోదు చేసారు బంజారాహిల్స్ పోలీసులు . ప్రముఖ యాంకర్ , న్యూస్ రీడర్ శ్వేతా రెడ్డి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ ఇన్ స్పెక్టర్ కళింగరావు కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు . అయితే అది ఆరోపణ కాదు సుమా ! బిగ్ బాస్ 3 కోసం . తెలుగు బిగ్ బాస్ 3 కోసం యాంకర్ యాంకర్ శ్వేతా రెడ్డి ని ఎంపిక చేశారట .

ఎంపిక అయ్యాక స్వయంగా కలవాలని శ్రీనగర్ కాలనీ లో కలిసారుట బిగ్ బాస్ నిర్వాహకులు . అయితే అక్కడ శ్వేతా రెడ్డి శరీర ఆకారంపై కామెంట్ చేశారట. అంతేకాదు బిగ్ బాస్ ని శాటిస్ ఫై చేయాలనీ కూడా కండీషన్ పెట్టారట ! అంటే కమిట్ మెంట్ అడుగుతున్నారా ? అని అప్పుడే సీరియస్ అయ్యిందట శ్వేతా రెడ్డి . కట్ చేస్తే అప్పటి నుండి బిగ్ బాస్ ప్రతినిధులు మళ్ళీ ఆమెని పట్టించుకోలేదట రెస్పాన్స్ లేదట అందుకే ఆగ్రహించి కేసు పెట్టింది . అయినా బిగ్ బాస్ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది శ్వేతా రెడ్డి .