తెలుగు బిగ్ బాస్ పై సంచలన వ్యాఖలు చేసిన యాంకర్


Anchor Shwetha Reddy
Anchor Shwetha Reddy

తెలుగు బిగ్ బాస్ 3 పై సంచలన వ్యాఖ్యలు చేసింది యాంకర్ శ్వేతా రెడ్డి . ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన శ్వేతా రెడ్డి ప్రస్తుతం యూట్యూబ్ నిర్వాహకురాలిగా ఉంది . అయితే ఈమెని బిగ్ బాస్ 3 లో పార్టిసిపేట్ చేయమని కోరారట ! అయితే మిమ్మల్ని ఎంపిక చేస్తాం బాగానే ఉంది మరి మా బాస్ ని ఎలా సాటిస్ ఫై చేస్తావు ? అని ప్రశ్నించారట దాంతో షాక్ అయిన శ్వేతా రెడ్డి అంటే కమిట్ మెంట్ ఇవ్వమని నేరుగా అడుగుతున్నారా ? అంటూ ప్రశ్నించిందట .

అయితే ఎప్పుడైతే ప్రశ్నించిందో అప్పటి నుండి శ్వేతా రెడ్డి ఫోన్ ని లిఫ్ట్ చేయడం లేదట బిగ్ బాస్ నిర్వాహకులు . దాంతో సంచలన వ్యాఖ్యలు చేసింది . నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ 3 త్వరలోనే ప్రారంభం కానుంది . కాగా ఆ బిగ్ బాస్ 3 లో పలువురిని ఎంపిక చేయగా శ్వేతా రెడ్డి ని మొదట ఎంపిక చేసి ఆ తర్వాత హ్యాండ్ ఇచ్చారట .