ఫొటోస్టోరీ: శ్రీ‌ముఖి రెచ్చిపోయిందిగా!


ఫొటోస్టోరీ: శ్రీ‌ముఖి రెచ్చిపోయిందిగా!
ఫొటోస్టోరీ: శ్రీ‌ముఖి రెచ్చిపోయిందిగా!

శ్రీ‌ముఖి.. బుల్లితెర‌పై ఈ పేరు తెలియ‌ని వారంటూ వుండ‌రు. త‌న‌దైన మేన‌రిజ‌మ్స్‌తో ఆక‌ట్టుకుంటూ యాంక‌ర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ న‌టించిన `జులాయి` సినిమాతో వెండితెర‌పై కెరీర్‌ని మొద‌లుపెట్టింది. దాదాపు 11 చిత్రాల్లో హీరోకు చెల్లెలిగా, హీరోయిన్‌కు ఫ్రెండ్‌గా క‌నిపించింది. కొన్ని చిత్రాల్లో లీడ్ పాత్ర‌ల్లో న‌టించినా పెద్ద‌గా గుర్తింపును మాత్రం పొంద‌లేక‌పోయింది.

దీతో బుల్లితెర‌ని న‌మ్ముకున్న శ్రీ‌ముఖి `ప‌టాస్‌` షోతో పాపుల‌ర్ అయింది. రాముల‌మ్మ‌గా పేరు తెచ్చుకున్న శ్రీ‌ముఖి `బిగ్‌బాస్` సీజ‌న్ 3 ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. టైటిల్‌ని సొంతం చేసుకోలేక‌పోయినా
గ‌ట్టి పోటీని మాత్రం ఇచ్చింద‌ని పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం స్టార్ మాలో స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ షో చేస్తున్న శ్రీ‌ముఖ ఈ మ‌ధ్య హాట్ హాట్ ఫొలోల‌తో ఇన్‌స్టాని హీటెక్కించేస్తోంది.

తాజాగా శ్రీ‌ముఖి ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఇన్‌స్టాలో శ్రీ‌ముఖిని ఫాలో అవుతున్న వారి సంఖ్య 2.5 మిలియ‌న్‌. తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోల్ని చూసిన వారంతా శ్రీ‌ముఖి రెచ్చిపోయిందిగా అంటున్నారు. మ‌రికొంద‌రేమో మ‌ళ్లీ సినిమాల్లోకి ఎంట‌ర్ కావ‌డానిక ఈ గ్లామర్ ఫీట్ల‌న్ని అంటూ కామెంట్ చేస్తున్నారు.

Credit: Instagram