వెండితెర‌పై హీరోగా సుమ వార‌సుడు!


Anchor suma`s son roshan kanakala as hero
Anchor suma`s son roshan kanakala as hero

టాలీవుడ్ తెర‌పైకి మ‌రో వార‌సుడు తెరంగేట్రం చేయ‌బోతున్నాడు. అత‌నే రోష‌న్ క‌న‌కాల‌. న‌టుడు రాజీవ్ క‌న‌కాల‌, బుల్లితెర‌పై పాపుల‌ర్ యాంక‌గా పేరు తెచ్చుకున్న యాంక‌ర్ సుమ‌ల త‌న‌యుడే ఈ రోష‌న్ క‌న‌కాల‌. గ‌త కొంత కాలంగా అత‌న్ని హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని సుమ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అది ఇప్ప‌టికి ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ఇటీవ‌ల వార‌సుల ఎంట్రీ ఎక్కువైపోతున్న విష‌యం తెలిసిందే. శ్రీ‌కాంత్ త‌నయుడు రోష‌న్ `పెళ్లిసంద‌డి` సీక్వెల్‌తో మ‌ళ్లీ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో నాగార్జున గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చిన `నిర్మాలా కాన్వెంట్‌`తో రోష‌న్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా వుంటే క‌న‌కాల ఫ్యామిలీ నుంచి రోష‌న్ క‌న‌కాల‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు.

ఇందు కోసం ఓ నూత‌న నిర్మాణ సంస్థ‌తో సుమ సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. ఆ సంస్థ‌తో క‌లిసి సుమ స‌హ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నార‌ని తెలిసింది. ఈ మూవీ ద్వారా విజ‌య్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌యే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.