బాటిల్ రక్తం రూ. 200 – కాలేజ్ ఫీజు రూ.1 కోటీ


Angrezi Medium Official Trailer released
Angrezi Medium Official Trailer released

కేవలం ఈ డైలాగ్ దగ్గర ఆగి ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడ్చిన వాళ్ళు నాకు తెలిసి చాలా మందే ఉండి ఉంటారు. ఎందుకంటే జీవితంలో ఎదగాలని చాలా మందికి ఉంటుంది. ప్రత్యేకంగా భారతదేశంలో పిల్లల కోసం తమ జీవితాలను త్యాగాలు చేసే తల్లి తండ్రులు ఉన్నారు. అదే విదేశాల్లో పిల్లలకు కనీసం ఒక 16 – 18 ఏళ్ళు రాగానే తల్లి తండ్రుల దగ్గర నుండి బయటకు వచ్చేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు. మరీ పెద్ద సహాయం కావలసి వచ్చినప్పుడు తప్ప పెద్దగా తల్లి తండ్రులతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు. కానీ మన దేశంలో అలా కాదు. తాజాగా ఇర్ఫాన్ ఖాన్ నటించిన అంగ్రేజీ మీడియం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇక ట్రైలర్ ప్రకారం లండన్ లో చదువుకోవాలనుకునే తన కూతురు కల నిజం చెయ్యడానికి ఒక మామూలు మధ్యతరగతి స్వీట్ షాప్ వ్యాపారి ఎంత దూరం వేళ్ళాడనేది ఈ సినిమా కథ.

ఇక మొదట్లో మనం మాట్లాడుకున్న డైలాగ్ అమయాకంగా ఆ తండ్రి తన కూతురు కోసం అంటాడు.”ఎంత కష్టం అయినా సరే, రక్తం అమ్మి నా కూతురుని చదివిస్తా అని.” ఇక మొత్తం మూడు కోట్ల రూపాయల కోసం బ్రిటిష్ సిటిజెన్ సహయం కోసం చూడటం, పాకిస్తాన్ నేటివ్ అయ్యి ఉండి, లండన్ లో టాక్సీ డ్రైవర్ పాత్రలో కరీనా కనపడటం ఈ సినిమాలో చూడవచ్చు. “ఒక మనిషి కల వదులుకోవడం అంటే సాక్షాత్తూ జీవితం వదులుకున్నట్లే” అనే డైలాగ్స్ మనల్ని ఆలోచింప చేస్తాయి. మన మనసు లోతులోనే సమాధానం దొరికే ప్రశ్నల కోసం, మనం ఈ ప్రపంచం అంతా అమాయకంగా వెదుకుతూ ఉంటాం అని ట్రైలర్ చివరలో ఇచ్చిన ఫైనల్ టచ్ అయితే అద్భుతం. ఇక గతంలో వచ్చిన హిందీ మీడియం అనే సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. సినిమాలో పాకిస్తానీ టాక్సీ డ్రైవర్ అయిన కరీనా దగ్గర ఇర్ఫాన్ మరియు అతని స్నేహితుడు “ఇన్ షా అల్లా..! ది బాయ్స్ ప్లేడ్ వెల్” అని చేసే కామెడీ కొసమెరుపు.