2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ మహేష్ దేనట !


మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మే 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున ఈ చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రాన్ని 2020 లో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్రారంభోత్సవం రోజునే సంక్రాంతి కి రిలీజ్ అని ప్రకటించారు . ఇక ఈ చిత్రం 2020 సంక్రాంతి బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని స్క్రిప్ట్ అద్భుతంగా రూపొందిందని తెలుస్తోంది .

ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా యాక్షన్ ని అలాగే కాస్త రొమాన్స్ ని టచ్ చేసి మిక్స్ చేసి జనాల మీదకు వదలడం అనిల్ రావిపూడి స్టైల్ . ఇప్పటివరకు ఈ దర్శకుడు చేసిన అన్ని సినిమాలు ఇదే ఫార్ములాతో చేసాడు . ఇక ఇప్పుడు మహేష్ సినిమాకు కూడా అదే అప్లై చేస్తున్నాడట . మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది . ఇక ఈ సినిమాని 80 కోట్ల లోపు ఫినిష్ చేయాలనీ చూస్తున్నాడట అనిల్ రావిపూడి .