సరిలేరు క్లైమాక్స్ ను సపోర్ట్ చేసుకున్న రావిపూడి


సరిలేరు క్లైమాక్స్ ను సపోర్ట్ చేసుకున్న రావిపూడి
సరిలేరు క్లైమాక్స్ ను సపోర్ట్ చేసుకున్న రావిపూడి

దర్శకుడిగా అనిల్ రావిపూడికి 100 పెర్సంట్ సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉంది. గత నాలుగు సినిమాలుగా నాలుగు సూపర్ హిట్లు కొట్టిన అనిల్ రావిపూడి ఐదో సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరును తెరకెక్కించిన సంగతి తెల్సిందే. జనవరి 11న విడుదలైన ఈ చిత్రం అదిరిపోయే కలెక్షన్స్ దూసుకుపోతోంది. సంక్రాంతి సెలవుల హంగామాను ఈ చిత్రం పూర్తిగా ఉపయోగించుకుంటోందని చెప్పాలి. నిజానికి ఈ చిత్రానికి చాలా యావరేజ్ రేటింగులే ఇచ్చారు క్రిటిక్స్. మౌత్ టాక్ కూడా సూపర్ హిట్ అనే రేంజ్ లో ఏం లేదు. కానీ మహేష్ క్రేజ్, చాలా కాలం తర్వాత మాస్ సినిమా చేయడంతో అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హైలైట్స్ కు కొదవే లేదు. మిలిటరీ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్, ఫారెస్ట్ ఫైట్, అల్లూరి సీతారామరాజు రెఫెరెన్స్, మైండ్ బ్లాక్ సాంగ్… ఇలా పలు హైలైట్స్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న సంగతి తెల్సిందే. ఇదే క్రమంలో ఈ సినిమాలో కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. తెగ నవ్విస్తుందని ప్రచారం చేసిన ట్రైన్ ఎపిసోడ్ బానే ఉన్నా ఊదరగొట్టేసిన రేంజ్ లో మాత్రం లేదని తేలిపోయింది. అలాగే ఈ చిత్ర క్లైమాక్స్ మీద కూడా ఫుల్ డిబేట్ నడుస్తోంది. ఇంత మాస్ సినిమాకు అంత సాఫ్ట్ టైటిల్ పెట్టడం కరెక్టేనా అని కొందరు సందేహిస్తుంటే కొందరు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు.

ఈ సినిమా క్లైమాక్స్ కు వస్తున్న రెస్పాన్స్ తెలుస్తోంది. దీనికి మిక్స్డ్ రెస్పాన్డ్స్ వచ్చిన విషయం తనకు తెలుసని, అయితే ఆ క్లైమాక్స్ రాస్తున్నప్పుడు తాను దీన్ని ఊహించానని, కానీ ఈ కథకు ఇదే బెస్ట్ క్లైమాక్స్ అని అనిల్ రావిపూడి సమర్ధించుకున్నాడు. దానికి రీజనింగ్ కూడా సినిమాలో చెప్పామని.. కానీ రెగ్యులర్ కు భిన్నంగా ఉండడంతో ఎక్కడానికి కొంత టైమ్ పడుతుందని, ఇండస్ట్రీ వ్యక్తుల నుండే ఈ విధమైన రెస్పాన్స్ వచ్చిందని, ప్రేక్షకులకు ఈ క్లైమాక్స్ బాగా నచ్చుతోందని చెప్పాడు అనిల్ రావిపూడి.